దగ్గుబాటి పురందేశ్వరికి కరోనా పాజిటివ్‌

దగ్గుబాటి పురందేశ్వరికి కరోనా పాజిటివ్‌
x
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. సామాన్యుల నుంచి రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధుల్ని ఈ మహమ్మారి వదలడం లేదు. ఇటీవల ఏపీలో...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. సామాన్యుల నుంచి రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధుల్ని ఈ మహమ్మారి వదలడం లేదు. ఇటీవల ఏపీలో ఎంపీలు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇటీవలే నియమితులైన దగ్గుబాటి పురందేశ్వరికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆమెహైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె చికిత్స తీసుకుంటున్నారు. తనలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఆమె కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. ఆమెకు కొవిడ్‌-19 సోకిందని వైద్యులు గుర్తించారు. వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స అందుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories