Cyclone Montha: బలహీనపడుతున్న మొంథా తుపాను.. ఆంధ్రాలో భారీ వర్షాల అలర్ట్

‘మొంథా’ తుపాను క్రమంగా బలహీనపడుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఆ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ప్రకటనలో తెలిపారు

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 29 Oct 2025 11:30 AM IST
Cyclone Montha: బలహీనపడుతున్న మొంథా తుపాను.. ఆంధ్రాలో భారీ వర్షాల అలర్ట్
X

Cyclone Montha: బలహీనపడుతున్న మొంథా తుపాను.. ఆంధ్రాలో భారీ వర్షాల అలర్ట్

విశాఖపట్నం: ‘మొంథా’ తుపాను క్రమంగా బలహీనపడుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఆ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ప్రకటనలో తెలిపారు

‘‘తీవ్ర తుపానుగా ఉన్న మొంథా ఇప్పటికే సాధారణ తుపానుగా మారింది. వచ్చే ఆరు గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నేడు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు పడే వీలుంది.

అలాగే కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుండి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది’’ అని పేర్కొన్నారు.

కోస్తాంధ్రలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

గమనించదగ్గ విషయం ఏమిటంటే, మొంథా తుపాను మంగళవారం రాత్రి 11.30 నుండి 12.30 గంటల మధ్య నరసాపురం సమీపంలో భూమిని తాకింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story