Cyclone Montha: బాపట్ల జిల్లాలో మొంథా తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు

Cyclone Montha: బాపట్ల జిల్లాలో మొంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Arun Chilukuri
Published on: 28 Oct 2025 11:24 AM IST
Cyclone Montha: బాపట్ల జిల్లాలో మొంథా తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు
X

Cyclone Montha: బాపట్ల జిల్లాలో మొంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో నివాసముంటున్న వారిని పట్టణంలోని ఆర్ట్స్ కాలేజ్ పునరావాస కేంద్రానికి తరలించారు అధికారులు. పట్టణంలో 20 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి తెలిపారు.

లోతట్టు ప్రాంత ప్రజలని ఈ పునరావాస కేంద్రాలకు తరలించినట్లు ఆయన తెలిపారు. వారికి కావాల్సిన టిఫిన్, భోజనము, మంచినీరు, వైద్య సదుపాయాలన్నీ ఏర్పాటు చేశామన్నారు. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని కమిషనర్ రఘునాథరెడ్డి తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story