Cyclone Michaung: ఏపీలో విధ్వంసం సృష్టిస్తున్న మిచౌంగ్‌ తుఫాన్‌

Cyclone Michaung: అరుకు లోయలో విరిగిపడిన కొండచరియలు

Jyothi
Published on: 6 Dec 2023 8:43 AM IST
Cyclone Michaung Causes Heavy Rainfall In Andhra Pradesh
X

Cyclone Michaung: ఏపీలో విధ్వంసం సృష్టిస్తున్న మిచౌంగ్‌ తుఫాన్‌ 

Cyclone Michaung: మిచౌంగ్‌ తుఫాన్‌ ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటికే లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. మరోవైపు.. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ రైలు మార్గంలో భారీ వర్షాలకు ప్రమాదకరంగా మారాయి కొండచరియలు.

కొత్తవలస కిరండోల్ రైలు మార్గంలో కొండచరియలు విరిగిడ్డంతో పట్టాలు తప్పింది గూడ్స్ రైలు ఇంజన్. శివలింగపురం యార్డ్ సమీపంలో ఈ ఘటన జరిగినట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు. దీంతో, కేకే లైన్‌లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అరకులోనే కిరండోల్ – విశాఖ ప్యాసింజర్‌ రైలును అధికారులు నిలిపివేశారు. ప్రయాణికులను ఆర్టీసీ బస్సులలో గమ్యస్థానాలకు తరలించే ప్రయత్నం.

Jyothi

Jyothi

Next Story