ఏపీలో బీభత్సం సృష్టిస్తున్న మండూస్ తుపాన్

* చిత్తూరు, తిరుపతి జిల్లాలలో తుపాన్ తీవ్ర ప్రభావం

R Tripura Malini
Published on: 9 Dec 2022 12:30 PM IST
Cyclone Mandous is causing Havoc In AP
X

ఏపీలో బీభత్సం సృష్టిస్తున్న మండూస్ తుపాన్ 

Andhra Pradesh: మండూస్ తుఫాన్ ప్రభావం చిత్తూరు, తిరుపతి జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తిరుపతి జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తుండడంతో...జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్. మండూస్ తీవ్ర తుపాన్ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. సూళ్లూరుపేట, నియోజకవర్గం తడకుప్పంలోని తీర ప్రాంతంలో నివాసం ఉంటున్న జాలర్ల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తుపాన్ ప్రభావంతో బీఎన్ కండ్రిగ, వరదయ్యపాలెం, తడ, సూళ్లూరుపేట, సత్యవేడులో బలంగా గాలులు వీస్తున్నాయి. తుపాను తీవ్రత దృష్ట్యా చిత్తూరు జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story