విశాఖ తీరానికి కొట్టుకు వచ్చిన బంగ్లాదేశ్ నౌక!

Cyclone effect: బంగాళాఖాతం లో వాయుగుండం ధాటికి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన బంగ్లాదేశ్ నౌక.
బంగాళాఖాతంలో ఏర్పడిన పెను వాయుగుండం కాకినాడ వద్ద తీరం దాటింది. సముద్రంలో అల్లకల్లోలం చేసిన ఈ వాయుగుండం.. తీరం దాటే సమయంలో తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులతో వాతావరణం బీభత్సంగా మారిపోయింది. ఇదిలా ఉంటె ఈ వాయుగుండం సందర్భంగా సముద్రంలో అలజడికి ఓ పెద్ద ఓడ విశాఖ సముద్ర తీరానికి కొట్టుకు వచ్చింది.
బంగ్లాదేశ్‌కు చెందిన మర్చంట్ వెసల్ నౌక ఒకటి సముద్రంలోని భారీ ఈదురుగాలులకు విశాఖ తెన్నేటి పార్క్ సమీపంలో ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. గాలి తీవ్రతకు ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఈ నౌక తీరంలో రాళ్ళకు చిక్కుని నిలిచిపోయింది. అర్ధరాత్రి సమయంలో ఇది జరిగింది. ఓడలో ఉన్న సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారు. నౌకను సముద్రంలో నిలిపి ఉంచడానికి వాడే యాంకర్లు రెండూ పూర్తిగా పాడవడంతో ఈ విధంగా జరిగి ఉంటుంది అధికారులు చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే నేవీ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకొని నౌకను బయటకు తీసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ నౌకలో మొత్తం 15 మంది సిబ్బంది ఉన్నారు.
కాగా, వాయుగుండం తో విశాఖపట్నం తో పాటు.. ఉత్తర కోస్తా తీరంలో భారీ వర్షాలు కురిశాయి. విశాఖ నగరంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇక వాయుగుండం తీరం దాటినా కాకినాడ తీర ప్రాంతంలో ఈదురుగాలులతో చెట్లు పడిపోయాయి. వర్షాలకు చాలా ఊళ్లు నీటిలో చిక్కుకు పోయాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా బుధవారం మరో వాయుగుండం బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
YCP Plenary: జులై 8,9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ
29 Jun 2022 8:10 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTవిజయ్ దేవరకొండ తో మూడో సినిమా ప్లాన్ చేస్తున్న పూరి
29 Jun 2022 7:33 AM GMTRation Card: వారి రేషన్‌కార్డులు రద్దవుతున్నాయి.. మీరు ఆ లిస్ట్‌లో...
29 Jun 2022 7:31 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల...
29 Jun 2022 7:16 AM GMT