PV Sunil Kumar: రఘురామను కస్టడీలో హింసించిన కేసు.. విచారణకు హాజరైన సునీల్‌కుమార్‌

PV Sunil Kumar: కస్టోడియల్ టార్చర్ కేసు విచారణకు ఏ-1 నిందితుడుగా ఉన్న సునీల్ కుమార్ హాజరయ్యారు.

Arun Chilukuri
Published on: 15 Dec 2025 11:50 AM IST
PV Sunil Kumar: రఘురామను కస్టడీలో హింసించిన కేసు.. విచారణకు హాజరైన సునీల్‌కుమార్‌
X

PV Sunil Kumar: కస్టోడియల్ టార్చర్ కేసు విచారణకు ఏ-1 నిందితుడుగా ఉన్న సునీల్ కుమార్ హాజరయ్యారు. రఘురామకృష్ణరాజును కస్టోడియల్ లో హింసించిన కేసులో పీవీ సునీల్ కుమార్ విచారణకు హాజరు కావాలని గతంలో నోటీసులు జారీ చేశారు. విచారణాధికారిగా విజయంగరం జిల్లా ఎస్పీ దామోదర్ నియామకం అయ్యారు. డిసెంబరు 4న విచారణకు రావాలని గత నెల 26న తొలి నోటీసు ఇవ్వగా.. కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఉన్నందున గడువు కావాలని సునీల్‌కుమార్‌ కోరారు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 15న విచారణకు రావాలని ఈ నెల 6న రెండోసారి నోటీసు ఇచ్చారు. దీంతో నేడు ఆయన విచారణకు హాజరయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story