Chandra Babu: చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు

Chandra Babu: తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబుపై కర్నూలులో క్రిమినల్ కేసు నమోదైంది

Samba Siva Rao
Updated on: 7 May 2021 9:45 PM IST
chandra babu
X

చంద్రబాబు ఫైల్ ఫోటో 

Chandra Babu: తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబుపై కర్నూలులో క్రిమినల్ కేసు నమోదైంది. కర్నూలులో ఎన్-440కే వైరస్ ఉందన్న చంద్రబాబు వ్యాఖ్యలతో సామాన్య జనాలు భయాందోళనకు గురి అవుతున్నారని సుబ్బయ్య ఫిర్యాదు చేశారు. సుబ్బయ్య అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. దీంతో ఐపీసీ 188,505(1)(బి)(2) సెక్షన్ల కింద చంద్రబాబుపై కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా 2005 ప్రకృతి వైపరీత్యాల చట్టంలోని సెక్షన్ 54 కింద నాన్‌బెయిల్ సెక్షన్లను నమోదు చేశారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story