Creative Economy Forum South 2026 LIVE: విశాఖలో 'క్రియేటివ్ ఎకానమీ ఫోరమ్' షురూ.. ప్రత్యక్ష ప్రసారం!

Arun Chilukuri
Published on: 31 Jan 2026 7:18 PM IST
X

Creative Economy Forum South 2026: విశాఖపట్నం వేదికగా సృజనాత్మకతకు వ్యాపార హంగులు అద్దుతూ, ఆర్థిక ప్రగతికి సరికొత్త బాటలు వేసే క్రియేటివ్ ఎకానమీ ఫోరమ్ సౌత్ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ది హాన్స్ ఇండియా ఆధ్వర్యంలో, hmtv మీడియా భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక వేదిక.. కళలు, సంస్కృతి, సాంకేతికతను జోడించి ఆదాయ మార్గాలను ఎలా సృష్టించవచ్చో ప్రపంచానికి చాటిచెప్పబోతోంది.

ఈ ఫోరమ్‌లో విధాన నిర్ణేతలు, పారిశ్రామికవేత్తలు, సృజనాత్మక రంగ నిపుణులు, ఫ్యాషన్ టెక్నాలజీ నిపుణులు ఒకే వేదికపైకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలను సృజనాత్మక, సాంస్కృతిక వ్యాపారాలకు ప్రధాన కేంద్రాలుగా మార్చడమే ఈ ఫోరమ్ ప్రధాన లక్ష్యం. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు లైవ్ లో చూద్దాం.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story