జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన బృందాకారత్‌

Arun Chilukuri
Published on: 2 Aug 2019 8:30 PM IST
జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన బృందాకారత్‌
X

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌‌రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మోడీతో జగన్ పరోక్ష అనైతిక పొత్తు పెట్టుకున్నారని ఆరోపించిన బృందాకారత్. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా పార్లమెంట్‌లో వైసీపీ వ్యవహరిస్తోందన్నారు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌లో మోడీని ఎందుకు ప్రశ్నించరంటూ నిలదీశారు. మోడీ-జగన్ అనైతిక పొత్తు ఏపీ ప్రయోజనాలను హరిస్తోందన్న బృందాకారత్‌ దీనిపై రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story