CPI Narayana: కొట్టేది వాళ్లే.. కేసులు పెట్టేది వాళ్లే

CPI Narayana: ఏపీలో వైసీపీవి చిల్లర రాజకీయాలు

Sandeep Eggoju
Published on: 24 Oct 2021 6:25 PM IST
CPI Narayana Serious Comments on YCP Government
X

వైసీపీ ప్రభత్వం పై సిపిఐ నారాయణ సీరియస్ (ఫైల్ ఇమేజ్)

CPI Narayana: ఏపీలో వైసీపీ చిల్లర రాజీకీయాలు చేస్తోందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కొట్టేది వాళ్లే కేసులు పెట్టేది వాళ్లే అంటూ ఆరోపించారు. ఒకవేళ తాము నిజ నిర్ధారణ కమిటీ వేస్తే ఒక శాతం బూతులు టీడీపీవి ఉంటే వైసీపీ నేతలవి 99 శాతం బూతులు బయటపడతాయన్నారు నారాయణ.

హుజూరాబాద్‌ ఎన్నికలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులను చూస్తుంటే ప్రజాస్వామ్యాన్ని నడి బజారులో నిల్చోపెట్టినట్టు ఉందని విమర్శించారు. అందుకే తాము ఎన్నికకు దూరంగా ఉన్నామన్నారు. ఎన్నికల కోడ్‌తో పాటు నైతిక విలువలను మరిచి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే దేశంలో డ్రగ్స్‌ రవాణా జరుగుతోందని అన్నారు నారాయణ. పోర్టులను అదానీకి అప్పజెప్పడం వల్ల దేశంలోకి అక్రమంగా గంజాయి, హెరాయిన్‌ వస్తున్నాయని ఆరోపించారు. పోర్టులు డ్రగ్స్‌ రవాణాకు అడ్డాగా మారాయంటూ తీవ్ర విమర్శలు చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story