CPI Narayana: చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

CPI Narayana: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Updated on: 18 July 2022 5:16 PM IST
CPI Narayana Sensational Comments on Mega Brothers
X

CPI Narayana: చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

CPI Narayana: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు చిరంజీవి హాజరవడాన్ని ఆయన తప్పుబట్టారు. చిరంజీవి ఊసరవెల్లి లాంటివాడంటూ హాట్ కామెంట్స్ చేశారు. అల్లూరి విగ్రహావిష్కరణకు సూపర్ స్టార్ కృష్ణను వేదికమీదకు తీసుకొచ్చి ఉంటే బాగుండేదని.. అలా కాకుండా ఊసరవెల్లిలా ప్రవర్తించే చిరంజీవిని తీసుకెళ్లడమేంటని ప్రశ్నించారాయన. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కూడా నారాయణ విమర్శించారు.

పవన్ కల్యాణ్ ఓ ల్యాండ్ మైన్ లాంటివాడని ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఆయనకే తెలియదంటూ సెటైర్లు వేశారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్రం చేసింది శూన్యమే అని, అలాంటప్పుడు ఎన్డీఏ బలపరిచిన వ్యక్తికి వైసీపీ, టీడీపీలు మద్దతు ఇవ్వడం అవసరమా? అని ప్రశ్నించారు. ఇన్నేండ్లయినా మనోళ్లు ఇంకా హైదరాబాద్‌నే రాష్ట్ర రాజధాని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై వ్యాఖ్యానిస్తూ స్వతంత్రంగా ఉండే వెంకయ్య నాయుడు నోరు నొక్కే పనిచేశారని ఎన్డీఏ కూటమిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story