CPI Narayana: సీఎం జగన్, చిరంజీవి భేటీపై నారాయణ సంచలన వ్యాఖ్యలు..

Meeting Between CM Jagan And Chiranjeevi: సీఎం జగన్, చిరంజీవి భేటీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.

Sriveni Erugu
Updated on: 16 Jan 2022 2:59 PM IST
CPI Narayana Make key Remarks on The Meeting Between CM Jagan And Chiranjeevi
X

CPI Narayana: సీఎం జగన్, చిరంజీవి భేటీపై నారాయణ సంచలన వ్యాఖ్యలు..

CPI Narayana: సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే వెళ్లి సీఎం జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి సీఎం జగన్‌తో భేటీ అనంతరం ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. చిరంజీవికి వైసీపీ రాజ్యసభ సీటు ఇస్తున్నారంటూ వార్తలు షికార్లు చేశాయి. అంతేకాకుండా ప్రధానపార్టీలు సైతం పలు ఆరోపణలు చేసుకున్నాయి. ఈ క్రమంలో చిరంజీవి సైతం స్పందించి ఆ వార్తలను ఖండించారు.

తాజాగా జగన్, చిరంజీవి భేటీపై సీపీఐ నేత నారాయణ పలు వ్యాఖ్యలు చేశారు. జగన్..‌ చిరంజీవి మధ్య ఏమి జరిగిందో తేలాల్సిందేనని అన్నారు. చిరంజీవిని తాము పిలవలేదని.. ఆయనే వచ్చారని ప్రభుత్వం చెప్తోంది... సీఎం పిలిస్తేనే వెళ్ళానని చిరంజీవి అంటున్నారు. ఏది నిజమో ప్రజలకు తెలియాలి అని డిమాండ్ చేశారు. పబ్లిక్ ఇష్యూని వ్యక్తిగతంగా మాట్లాడటం సరైంది కాదన్నారు. కనుమ రోజు కఠోర వాస్తవాలు మాట్లాల్సి వస్తోందని నారాయణ అన్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story