CPI Narayana: జగన్‌కు సీఎంగా కొనసాగే అర్హత లేదు..తన పదవికి రాజీనామా చేయాలి

CPI Narayana: తనను కాపాడమని జగన్ ఢిల్లీకి వెళుతున్నాడు.

Arun Chilukuri
Published on: 29 May 2023 2:02 PM IST
CPI Narayana Comments on CM Jagan
X

CPI Narayana: జగన్‌కు సీఎంగా కొనసాగే అర్హత లేదు..తన పదవికి రాజీనామా చేయాలి

CPI Narayana: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాత్ర ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. వివేకా కేసులో జగన్‌ను కూడా విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. హత్య కేసులో జగన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, జగన్‌కు సీఎంగా కొనసాగే అర్హత లేదన్నారాయన. సీఎం తన పదవికి రాజీనామా చేయాలి నారాయణ డిమాండ్ చేశారు. తనను కాపాడమని జగన్ ఢిల్లీకి వెళుతున్నాడని ఎద్దేవా చేశారు. సీబీఐకి ఉన్న పరువును అవినాష్ రెడ్డి తీసేశారని, సీబీఐకి ఉన్న విలువను కాపాడాలని నారాయణ కోరారు. జస్టిస్ ఎన్.వి.రమణ న్యాయవ్యవస్థకు అన్యాయం చేశాడని ఆరోపించారు. న్యాయవ్యవస్థ మసకబారిందన్నారాయన.

పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఎందుకు ఆహ్వానించలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మోడీ అవమానించారని ఆయన ఆరోపించారు. కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత అయినా బీజేపీ నేతల్లో మార్పు రావా నారాయణ సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story