COVID19 Updates : ఏపీ 289 కొత్త కేసులు, 3 మరణాలు

ఏపీలో కొత్తగా 289 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Samba Siva Rao
Published on: 6 Jan 2021 9:12 PM IST
COVID19 Updates : ఏపీ  289 కొత్త కేసులు, 3 మరణాలు
X

ఏపీలో కొత్తగా 289 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 51,207 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 42, చిత్తూరు 40, విశాఖపట్నం జిల్లాల్లో 40 కేసులు గుర్తించారు. , విజయనగరం జిల్లాలో 9 కేసులు నిర్థారణ అయ్యాయ. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 7, శ్రీకాకుళం జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 428 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, ముగ్గురు మరణించారు. ప్రస్తుతం 2,896 మంది చికిత్స పొందుతున్నారు. కృష్ణా, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 7,125కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,83,876 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,73,855 మంది కరోనా నుంచి కోలుకుని డిశార్జ్ అయ్యారు.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story