ఏపీలో విజయవంతంగా ముగిసిన కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్

ఏపీలో విజయవంతంగా ముగిసిన కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్‌ విజయవంతంగా ముగిసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ కృష్ణా జిల్లాలో ఐదు ఆసుపత్రులలో డ్రై రన్...

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్‌ విజయవంతంగా ముగిసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ కృష్ణా జిల్లాలో ఐదు ఆసుపత్రులలో డ్రై రన్ చేపట్టారు. ఏపీలో విజయవంతంగా ముగిసిన కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ పై hmtv స్పెషల్ రిపోర్ట్

కృష్ణా జిల్లాలోని అయిదు సెంటర్లలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ దిగ్విజయంగా ముగిసింది. జిల్లాలోని 5 సెంటర్లలో వ్యాక్సినేషన్ డ్రై రన్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆధ్వర్యంలోని‌ కమిటీ డ్రై రన్ నిర్వహణను పరిశీలించింది. ప్రతి సెంటర్‌లో 25 మంది చొప్పున డమ్మీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. ప్రధానంగా వ్యాక్సిన్ సరఫరా, భద్రత, కోవిన్ యాప్ పరిశీలన, అత్యవసర పరిస్ధితులలో ఏం చేయాలనేది ఈ డ్రై రన్ ద్వారా తెలుసుకున్నారు.

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి, విజయవాడ ప్రకాష్‌నగర్‌లోని అర్బన్‌ హెల్త్‌ కేర్‌ సెంటర్‌, కంకిపాడు మండల పరిధిలోని ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సూర్యారావుపేటలోని పూర్ణా హార్ట్‌ ఇని స్టిట్యూట్‌, పెనమలూరు ఆరోగ్య కేంద్రం పరిధిలోని తాడిగడప సచివాలయం-4లోని కృష్ణవేణి డిగ్రీ కాలేజీలో ఈ కరోనా వ్యాక్సినేషన్‌ డ్రై రన్‌ నిర్వహించారు. ఈ వ్యాక్సిన్ డ్రై రన్‌ కోసం ప్రతి కేంద్రంలో 3 గదులు, ఐదుగురు సిబ్బందిని ఏర్పాటు చేశారు. మొదటి గదిలో రిజిస్ట్రేషన్‌, రెండో గదిలో వ్యాక్సినేషన్‌, మూడో గదిలో పరిశీలన చేశారు. కొవిన్ యాప్ పరిశీలన, ఇతర సమస్యలు తెలుసుకునేందుకే ఇది నిర్వహించారు.

ప్రతి సెంటర్‌లో ఎంపిక చేసిన 25 మందితో డ్రై రన్‌ చేపట్టారు. ఫ్రెంట్ లైన్ వారియర్స్ ఆరోగ్య కార్యకర్తల లబ్దిదారుల జాబితా రూపొందించి వారి వివరాలను అధికారులు కో-విన్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేసారు. వాక్సినేషన్ డ్రై రన్ ప్రక్రియని వీడియో తీసి జిల్లా, రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ లకు నివేదిక అందించారు.

నాలుగు రాష్ట్రాలలో ముందుగా పూర్తి స్ధాయిలో విజయవంతంగా వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించిన రాష్ట్రంగా ఏపీ నిలిచిందన్నారు కృష్ణా కలెక్టర్ ఇంతియాజ్. మొత్తం సిస్టమాటిక్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంతా సిద్ధమైందని, దానిపై పూర్తి సమాచారం కో విన్ యాప్ ద్వారా కేంద్రానికి చేరిందని తెలిపారు. ఒకేసారి ఎంత మందికి వ్యాక్సిన్ ఇవ్వవచ్చు, టెక్నాలజీ ఎలా ఉంది అనే అంశాలను ఇప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories