విశాఖలో కొవిడ్‌ కలకలం.. మహిళ మృతితో ఆందోళన

Visakha: తాజాగా 20కి చేరిన పాజిటివ్ కేసులు

Jyothi
Published on: 27 Dec 2023 9:03 AM IST
COVID Cases in Vizag Surge to 20
X

విశాఖలో కొవిడ్‌ కలకలం.. మహిళ మృతితో ఆందోళన

Visakha: విశాఖలో కొవిడ్‌తో మహిళ మృతి చెందడం కలకలం రేపింది. కొవిడ్ బారిన పడిన ఓ మహిళ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. సుదీర్ఘ విరామం తర్వాత కొవిడ్ మరణం నమోదు కావడంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు విశాఖలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కోవిడ్ కేసుల సంఖ్య 20కి చేరింది. దీంతో కేజీహెచ్‌లో ఆక్సిజన్ బెడ్స్‌తో పాటు ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.

Jyothi

Jyothi

Next Story