ఏపీలో పెరిగిన కరోనా కేసుల సంఖ్య.. ఆ ఒక్క జిల్లాలోనే ఆరుగురికి

ఏపీలో పెరిగిన కరోనా కేసుల సంఖ్య.. ఆ ఒక్క జిల్లాలోనే ఆరుగురికి
x
Highlights

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈ మహమ్మారి దాటికి ఏడు లక్షల పైగా కేసులు నమోదయ్యాయి.

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈ మహమ్మారి దాటికి ఏడు లక్షల పైగా కేసులు నమోదయ్యాయి.భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య వెయ్యి దాటింది.1024 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా.. 27 మంది మృతి చెందారు.

తెలుగు రాష్ట్రాలు కూడా ఈ మహమ్మారి దాటికి విలవిలలాడిపోతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరింది. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో కరోనా పాజిటివ్ కేసులు ఇద్దరికి నెగిటివ్‌గా తేలింది. విశాఖలో చికిత్స పొందుతున్న వ్యక్తికి కరోనా నెగిటివ్ వచ్చింది. ఇప్పటివరకు 616 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 495 మందికి నెగిటివ్, మరో 100 మంది ఫలితాలు రావాల్సి ఉంది. తెలంగాణలో 70 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 11 మందికి పరీక్షలో నెగిటివ్ వచ్చినట్టు వచ్చినట్టు సీఎం కేసీఆర్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

విశాఖలో 2 నమోదైన పాజిటివ్ కేసులు. యూకే నుంచి వచ్చి కరోనా బారిన పడిన పేషెంట్ నెంబర్ 7కు కొత్తగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారు కాంటాక్ట్ కావడంతో కరోనా వచ్చింది. విశాఖ జిల్లాలోనే ఆరుగురికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నలుగురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురికి కరోనా సోకింది. చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు కరోనా బాధితులు ఉన్నారు. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య పేరుగుతున్న నేపథ్యంలో కొన్ని ప్రైవేట్ మెడికల్ కళాశాలలో పరీక్షలకు అనుమతులు ఇచ్చింది.

నేటినుంచి నిత్యావసరాల ఈ విషయంలో విధించిన ఆంక్షలు కూడా ప్రభుత్వం సడలించింది. నేటి నుంచి ఉదయం 11 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories