Andhra Pradesh: ఏపీలో ఆగని లోన్‌ యాప్‌ ఆగడాలు...రాజమండ్రిలో దంపతుల ఆత్మహత్య

Andhra Pradesh: న్యూడ్ ‌ఫొటోలు ఆన్‌లైన్‌లో పెడతామని బెదిరింపులు

Jyothi
Published on: 8 Sept 2022 10:31 AM IST
Couple Commits Suicide Due To Loan App Harassment In Rajahmundry
X

Andhra Pradesh: ఏపీలో ఆగని లోన్‌ యాప్‌ ఆగడాలు...రాజమండ్రిలో దంపతుల ఆత్మహత్య

Andhra Pradesh: ఏపీలో లోన్ యాప్‌ల వేధింపులు ఆగడం లేదు. రాజమండ్రిలో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు భార్య భర్తలు బలయ్యారు. ఆనందనగర్ పేపర్ మిల్లు వద్ద నివాసం ఉంటున్న కోటిపల్లి దుర్గారావు, లక్ష్మీ దంపతులు ఆన్‌లైన్‌ యాప్‌లో 50వేల రూపాయలు లోన్ తీసుకున్నారు. లోన్ సమయానికి కట్టలేకపోవడంతో యాప్ నిర్వాహకులు బెదిరింపులకు దిగారు. లోన్ కట్టకకపోతే మీ ఫేస్ మార్పింగ్ చేసి న్యూడ్ ఫొటోలు ఆన్‌లైన్ పెడుతామని బెదిరించారు. దీంతో మనస్థాపం చెందిన దుర్గారావు, లక్ష్మీ ఓ లాడ్జిలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల సొంతూరు రాజువమ్మంగి మండలం లబ్బర్తిగా గుర్తించారు. దుర్గారావు ఐదేళ్లుగా రాజమండ్రిలో నివాసం ఉంటూ పెయింటర్‌గా పని చేస్తున్నాడు. ఆత్మహత్య ఘటనపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story