ప్రణయ్‌ని చంపినట్లు చంపుతామని..
గుంటూరు నగరంలో ఓ వివాహిత కిడ్నాప్ కలకలం రేపుతోంది. దిలీప్, సౌమ్య అనే ఇరువురు రెండు నెలలక్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. నాటి నుంచి యువతి యువకుడికి తీవ్ర బెదిరింపులు వస్తున్నాయి. నల్గొండ ప్రణయ్ విషయం గుర్తు ఉందిగా అంటూ హెచ్చరించారు. ప్రణయ్ మాదిరిగా హత్య చేస్తామని యువతి తల్లిదండ్రులు బెదిరింపులకు పాల్పడ్డారు. మంగళవారం నాడు దిలీప్ కుటుంబసభ్యులను కొట్టి సౌమ్యను తీసుకెళ్లారు. మిర్యాలగూడలో ప్రణయ్ ను హత్య చేసినట్టుగానే హత్య చేయిస్తామని తనను బెదిరించారని సౌమ్య కుటుంబసభ్యులపై దిలీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సౌమ్య కుటుంబసభ్యులతో తనకు ప్రాణహాని ఉందని దిలీప్ గుంటూరు ఎస్పీని ఆశ్రయించారు. తనకు రక్షణ కల్పించాలని ఆయన కోరాడు.
Next Story




