ప్రకాశం జిల్లాలో ర్యాపిడ్‌ కిట్ల మాయాజాలం

ప్రకాశం జిల్లాలో ర్యాపిడ్‌ కిట్ల మాయాజాలం
x
Highlights

ప్రకాశం జిల్లాలో ర్యాపిడ్‌ కిట్ల మాయాజాలం సాగుతోంది. అనుమతులు లేని ప్రైవేట్‌ వ్యక్తులు దీన్ని ఒక వ్యాపారంగా మార్చుకున్నారు. సరైన నిర్థారణ చేయకుండా...

ప్రకాశం జిల్లాలో ర్యాపిడ్‌ కిట్ల మాయాజాలం సాగుతోంది. అనుమతులు లేని ప్రైవేట్‌ వ్యక్తులు దీన్ని ఒక వ్యాపారంగా మార్చుకున్నారు. సరైన నిర్థారణ చేయకుండా గాలికొదిలేస్తున్నారు. కొందరు ప్రభుత్వ వైద్యసిబ్బంది ఉచిత పరీక్షలకు ఇచ్చిన కిట్లను ప్రైవేట్‌ వ్యక్తులకు విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ర్యాపిడ్ యాంటీజెన్ ఫలితాలు వెంటనే వస్తుండడంతో ప్రకాశం జిల్లాలో పెద్ద మొత్తంలో ఈ పరీక్షలే నిర్వహిస్తున్నారు. దాంతో వాస్తవ ఫలితాలు ఎంతవరకు వస్తున్నాయో తెలియని పరిస్థితి. ర్యాపిడ్ పరీక్షలతో అటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో గానీ ఇటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో గాని వాస్తవ ఫలితాలు అందడం లేదు.

ఇలా ర్యాపిడ్‌ కిట్లను నమ్మలేక వీఆర్‌డీఎల్‌ రిపోర్టులు వచ్చే వరకు ఆగలేక ప్రజలు సతమతమవుతున్నారు. మరోవైపు ర్యాపిడ్ పరీక్షకు 750 రూపాయలు మాత్రమే తీసుకోవలసి ఉండగా, కొందరు 3 వేల 500 వరకు వసూలు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఐసీఎంఆర్‌ అనుమతి ఉన్న ప్రైవేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌లు పరీక్షలు నిర్వహించవచ్చని, నిర్ణయించిన మొత్తాన్ని మాత్రమే వసూలు చేయాలని అధికారులు అంటున్నారు. అక్రమంగా వసూళ్లు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ అంటున్నారు.

ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు ఎంతవరకు ఉపయోగ పడుతుందో, తెలియక ప్రజలు సతమతమవుతున్నారు. రోగ నిర్ధారణ కోసం పెద్ద మొత్తంలో ర్యాపిడ్ కిట్లనే ఉపయోగించడంతో వాస్తవ ఫలితాలు అందక బాధితులు మృత్యువాత పడుతున్నారు. సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories