సర్టిఫికెట్‌కో రేటు..హెచ్ఎంటీవీకి చిక్కాడు...

బర్త్ సర్టిఫికెట్‌కి లంచం... డెత్ సర్టిఫికెట్‌కి లంచం... ఎక్కడ చూసినా లంచం.. లంచం..లంచం.. ఇదో సినిమా...
బర్త్ సర్టిఫికెట్‌కి లంచం... డెత్ సర్టిఫికెట్‌కి లంచం... ఎక్కడ చూసినా లంచం.. లంచం..లంచం.. ఇదో సినిమా డైలాగ్. కానీ రియల్ లైఫ్‌లో కూడా సామాన్యులు లంచం ఇచ్చుకోనిదే పనులు జరగడం లేదు. చేసే ప్రతిపనికి లంచం డిమాండ్ చేస్తూ పేదలను కొందరు ప్రభుత్వ ఉద్యోగులు జలగల్లా పీడిస్తున్నారు. బర్త్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసి అడ్డంగా బుక్కైన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.
ఈ దృశ్యాలు గుంటూరు జిల్లా నర్సరావుపేట ఎమ్మార్వో కార్యాలయంలోనిది. బాధితుడి దగ్గర నుండి పచ్చనోట్లు తీసుకొని పేపర్లు కింద దాచుకుంటున్న ఇతను జూనియర్ అసిస్టెంట్ ఖాసీం. పట్టణానికి చెందిన అంకమరావు గతకొద్ది కాలంగా బర్త్ సర్టిఫికెట్ కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. రెండు వేల రూపాయలు ఇస్తేనే సర్టిఫికెట్ ఇస్తానని చెప్పడంతో హెచ్‌ఎం టీవీని ఆశ్రయించాడు.
ఆఫీస్‌లోనే పట్టపగలు అందరి ఎదురుగానే రెండు వేలు తీసుకొని మరో రెండ్రోజుల్లో బర్త్ సర్టిఫికెట్ ఇచ్చేస్తానంటూ చెప్పాడు. దృశ్యాలను రికార్డ్ చేసిన హెచ్‌ఎంటీవీ ప్రతినిధి లంచం ఎందుకు తీసుకున్నారంటూ ప్రశ్నిస్తే తనకేం తెలియదంటూ అక్కడి నుండి ఉడాయించాడు.
లైవ్ టీవి
జనసేనకి మరో షాక్
13 Dec 2019 3:58 PM GMTమాజీ ఎంపీ హర్షకుమార్ అరెస్టు
13 Dec 2019 3:33 PM GMTతప్పిన ప్రమాదం : 25 మంది విద్యార్థులున్న పాఠశాల బస్సు...
13 Dec 2019 3:15 PM GMTమహేష్ పాటపై రష్మిక టిక్ టాక్ వీడియో
13 Dec 2019 2:52 PM GMTనకిలీ ఐ.ఆర్.ఎస్ అధికారి పేరిట శ్రీవారి వీఐపి బ్రేక్ దర్శన...
13 Dec 2019 2:30 PM GMT