ప్రమాదంలో చిక్కుకున్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేటర్లు

Visakha: కులుమనాలి నుంచి చండీగఢ్ వెళుతుండగా విరిగిపడ్డ కొండచరియలు

Jyothi
Published on: 20 Aug 2022 11:12 AM IST
Corporators Stuck In Ghat Road
X

ప్రమాదంలో చిక్కుకున్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేటర్లు 

Visakha: గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేటర్లు ప్రమాదంలో చిక్కుకున్నారు. కులు మనాలి నుంచి చండీగఢ్ వెళ్తుండగా కొండ చరియలు విరిగిపడటంతో కార్పొరేటర్లు ఘాట్ మధ్యలో ఇరుక్కుపోయారు. రాత్రి నుంచి రోడ్ పై బస్సుల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికే ఆర్మీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టినప్పటికీ... వర్షం పడుతుండడంతో రోడ్ క్లియర్ చేసేందుకు పరిస్థితులు అనుకూలించలేదు. చండీగఢ్‌కు 240 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఈ నెల 16 నుంచి స్టడీ టూర్ లో ఉన్న విశాఖ నగర పాలక సంస్థకు చెందిన 95 మంది కార్పొరేటర్లు... ఇప్పటివరకు ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, సిమ్లా, కులు మనాలిని సందర్శించారు.

Jyothi

Jyothi

Next Story