ఏపీలో ఇవాళ మరో 10 పాజిటివ్ కేసులు.. ఆ రెండు జిల్లాలో డేంజర్


ఏపీలో కరోనా పాజటివ్ బాధితుల సంఖ్య 190కి చేరింది. ఇవాళ కొత్తగా 10 మందికి కరోనా వైరస్ సోకినట్టు వైద్య ఆరోగ్య శాఖ నిర్ధారించింది.
ఏపీలో కరోనా పాజటివ్ బాధితుల సంఖ్య 190కి చేరింది. ఇవాళ కొత్తగా 10 మందికి కరోనా వైరస్ సోకినట్టు వైద్య ఆరోగ్య శాఖ నిర్ధారించింది. ఈ రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించిన పరీక్షల్లో కొత్తగా పది మందికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
అందులో ఇవాళ ఒక్కరోజు కృష్ణా జిల్లాలో (5), గుంటూరు (3), ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్టు ప్రకటించింది. ఇక జిల్లాల వారీగా చూస్తే కృష్ణా (32), నెల్లూరు (32) జిల్లాల్లో అత్యధికంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు (26), కడప (23), ప్రకాశం జిల్లా(19), విశాఖపట్నం(15), పశ్చిమ గోదావరి (15), తూర్పు గోదావరి (11), చిత్తూరు( 10) , కర్నూలు (4), అనంతపురం (3)లో కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి.
శ్రీకాకుళం, విజయనగరంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా బాధితుల చిరునామా కూడా అందించింది. పేషెంట్ నెంబర్ 41 నుంచి 130 వరకు వివరాలను వెల్లడించింది. వారంతా ఢిల్లీలోని ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారేనని ప్రభుత్వం ప్రకటించిన నివేదికల్లో పేర్కొంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



