Coroanvirus Updates in Ongole: ఒంగోలులో పెరుగుతున్న కరోనా కేసులు

Coroanvirus Updates in Ongole: ఒంగోలులో పెరుగుతున్న కరోనా కేసులు
x
Representational Image
Highlights

Coroanvirus Updates in Ongole: కరోనా బాధితులతో సర్వజన ఆసుపత్రి నిండిపోయింది.

Coroanvirus Updates in Ongole: కరోనా బాధితులతో సర్వజన ఆసుపత్రి నిండిపోయింది. పడకలు సరిపోక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పాజిటివ్‌ నిర్ధరణ అయిన వారందరినీ జీజీహెచ్‌కు తరలించి చికిత్స చేస్తున్నారు. అయితే అక్కడ తగినంత వసతి లేక తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొంత మంది ప్రైవేటు ఆసుపత్రులకు పంపిస్తే చికిత్స చేయించుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఒంగోలు నగరంలోని రెండు కార్పొరేట్‌ ఆసుపత్రులను అధీనంలోకి తీసుకుని కరోనా బాధితులకు అక్కడ వైద్యం అందించారు. జీజీహెచ్‌లో 400 పడకలు అందుబాటులో ఉండగా... కొన్నిటిని సాధారణ రోగులకు వినియోగిస్తున్నారు. కరోనా బాధితుల కోసం ప్రత్యేక గదులను వినియోగంలోకి తెచ్చినా.. అవీ నిండిపోయాయి. వైరస్‌ నుంచి కోలుకున్న కొంత మందిని డిశ్చార్జి చేయడానికి అవకాశం ఉన్నా.. 108 వాహనాలను సిద్ధం చేయడం సమస్యగా మారింది. సొంత వాహనాలు కలిగిన వారు.. వాటిల్లో ఇళ్లకు వెళుతున్నారు. అద్దె వాహనదారులు ముందుకు రావడం లేదు. సుమారు 30 మందిని డిశ్చార్జి చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులతో పాటు మరణాలు ప్రారంభమయ్యాయి. గడిచిన మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు మృతి చెందగా- ఆదివారం ఒక్కరోజే ఇద్దరు చనిపోయారు. ఇక జిల్లా వ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకు పెరిగిపోతున్న పాజిటివ్‌ కేసులతో జిల్లా వాసులు ఆందోళన చెందున్నారు. ఎప్పుడు ఎవరి నుంచి కరోనా దాడి చేస్తుందో తెలియక ప్రజలు భయాందోలనకు గురవుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories