Coronavirus Updates in AP: ఏపీలో 3 లక్షలకు చేరువలో కరోనా కేసులు

Arun Chilukuri
Published on: 17 Aug 2020 6:29 PM IST
Coronavirus Updates in AP: ఏపీలో 3 లక్షలకు చేరువలో కరోనా కేసులు
X
Coronavirus Updates in india

Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువైంది. గడిచిన 24 గంటల్లో 6,780 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 44,578 శాంపిల్స్‌ని పరీక్షించగా 6,780 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 7,866 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 82 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లాలో పదమూడు మంది; తూర్పు గోదావరి జిల్లాలో పది మంది; చిత్తూరు జిల్లాలో ఎనిమిది మంది; గుంటూరు, కడప జిల్లాల్లో ఏడుగురు; శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆరుగురు; అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు; కృష్ణా జిల్లాలో ముగ్గురు; నెల్లూరు జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 2,93,714. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 2,732. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,06,205 కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 84,777 మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 44,578 నమూనాలను పరీక్షించారు. ఇప్పటి వరకు మొత్తంగా 29.05లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు.





Arun Chilukuri

Arun Chilukuri

Next Story