Coronavirus Updates in AP: ఏపీలో లక్ష దాటిన కరోనా కేసులు

Arun Chilukuri
Published on: 27 July 2020 6:24 PM IST
Coronavirus Updates in AP: ఏపీలో లక్ష దాటిన కరోనా కేసులు
X
Corona updates in india

Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు లక్ష దాటాయి. రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 6,051 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 43,127 శాంపిల్స్‌ని పరీక్షించగా 6,051 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 3,234 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో కరోనా వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలో తొమ్మిది మంది, విశాఖ జిల్లాలో ఎనిమిది, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఏడుగురు చొప్పున, కృష్ణ జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో నలుగురు, అనంతపురం జిల్లాలో ముగ్గురు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు చొప్పున, కడప, ప్రకాశం జిల్లాల్లో ఒక్కరు చొప్పున కరోనా బారిన పడి మరణించినట్లు ప్రభుత్వం బులిటెన్‌లో వెల్లడించింది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 1,02,349. ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1,090. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 49,558 కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 51,701 మంది చికిత్స పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 43,127 కరోనా శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పటి వరకు ఏపీలో 16,86446 కరోనా శాంపిల్స్ నిర్వహించింది ప్రభుత్వం.






Arun Chilukuri

Arun Chilukuri

Next Story