Coronavirus Updates in AP: ఏపీలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు.. ఒక్కరోజే 62 మంది మృతి..

Arun Chilukuri
Updated on: 21 July 2020 7:08 PM IST
Coronavirus Updates in AP: ఏపీలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు.. ఒక్కరోజే 62 మంది మృతి..
X

Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 4,944 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 37,162 శాంపిల్స్‌ని పరీక్షించగా 4,944 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 1,232 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 62 మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పుగోదావరిలో అత్యధికంగా 10 మంది, విశాఖపట్నంలో 9 మంది, చిత్తూరు జిల్లాలో 8 మంది, శ్రీకాకుళం జిల్లాలో ఏడుగురు, అనంతపురం జిల్లాలో ఆరుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరుగురు, గుంటూరులో 5, ప్రకాశంలో ఐదుగురు, కర్నూలులో నలుగురు, కడపలో ఒకరు, విజయనగరంలో ఒకరు మరణించినట్లు ప్రభుత్వం బులిటెన్‌లో వెల్లడించింది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 55,773. ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 758. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 22,896 కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 32,119 మంది చికిత్స పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 37,162 కరోనా శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పటి వరకు ఏపీలో 13,86,274 కరోనా శాంపిల్స్ నిర్వహించింది ప్రభుత్వం.





Arun Chilukuri

Arun Chilukuri

Next Story