Coronavirus Updates in AP: ఏపీలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు.. ఒక్కరోజే 42 మంది మృతి..

Arun Chilukuri
Published on: 17 July 2020 3:00 PM IST
Coronavirus Updates in AP: ఏపీలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు.. ఒక్కరోజే 42 మంది మృతి..
X

Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 2,592 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 20,245 శాంపిల్స్‌ని పరీక్షించగా 2592 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 837 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం 6, చిత్తూరు 5, తూర్పుగోదావరి 5, ప్రకాశం 5, గుంటూరు 4, పశ్చిమ గోదావరి 4, కడప 3, విశాఖపట్నం 3, కర్నూలు 2, నెల్లూరు 2, విజయనగరం 2, కృష్ణాలో ఒకరు కరోనా వల్ల మరణించినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 37,751. ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 534. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 17,812కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 19,405 మంది చికిత్స పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 20,245 కరోనా శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పటి వరకు ఏపీలో 12,60,512 కరోనా శాంపిల్స్ నిర్వహించింది ప్రభుత్వం.





Arun Chilukuri

Arun Chilukuri

Next Story