Coronavirus Updates in AP: ఏపీలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు.. ఒక్కరోజే 40 మంది మృతి..

Arun Chilukuri
Published on: 16 July 2020 3:49 PM IST
Coronavirus Updates in AP: ఏపీలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు.. ఒక్కరోజే 40 మంది మృతి..
X

Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 2584 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 22,304 శాంపిల్స్‌ని పరీక్షించగా 2584 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 943 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో-08, ప్రకాశం-08, చిత్తూరు-05, కడప-04, అనంతపురం-03, గుంటూరు-03, నెల్లూరు-03, విశాఖపట్నం-03, శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు కరోనా కారణంగా చనిపోయినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 35,159. ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 492. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 16,975కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 17,692 మంది చికిత్స పొందుతున్నారు.






Arun Chilukuri

Arun Chilukuri

Next Story