Coronavirus Updates in AP: ఏపీలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు.. ఒక్కరోజే 44 మంది మృతి..

Arun Chilukuri
Updated on: 15 July 2020 4:08 PM IST
Coronavirus Updates in AP: ఏపీలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు.. ఒక్కరోజే 44 మంది మృతి..
X
Representational Image

Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 2412 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 22,197 శాంపిల్స్‌ని పరీక్షించగా 2412 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 805 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్-19 కారణంగా ఒక రోజులో నమోదైన అత్యధిక మరణాలు ఇదే. గత 24 గంటల్లో అనంతపురం జిల్లాలో 9 మంది, పశ్చిమ గోదావరి 9, కర్నూలు 5, చిత్తూరు 4, తూర్పు గోదావరి 4, విశాఖపట్నం 4, కడప 2, కృష్ణా 2, ప్రకాశం 2, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు కరోనా కారణంగా చనిపోయినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 32,575. ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 452. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 16,032కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 16,091 మంది చికిత్స పొందుతున్నారు.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story