ఏపీలో భారీగా నమోదవుతున్న కరోనా కేసులు.. ఇవాళ ఒక్కరోజే..

Arun Chilukuri
Published on: 31 Aug 2020 6:37 PM IST
ఏపీలో భారీగా నమోదవుతున్న కరోనా కేసులు.. ఇవాళ ఒక్కరోజే..
X

Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 10,004 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 56,490 శాంపిల్స్‌ని పరీక్షించగా 10,004 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 8,772 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 85 మంది మృతి చెందారు. నెల్లూరు 12, చిత్తూరు 9, ప్రకాశం 9, కడప 8 మంది కరోనా వల్ల మృతి చెందారు. అనంతపురం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు ఏడుగురు చొప్పున మృతి చెందారు. కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో ఆరుగురు చొప్పున మృతి చెందారు. శ్రీకాకుళం 4, కృష్ణా 2, విజయనగరంలో ఒకరు మరణించినట్లు ప్రభుత్వం బులిటెన్‌లో వెల్లడించింది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 4,31,876. ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 3,969. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 3,27,631 కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 1,00,276 మంది చికిత్స పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 56,490 కరోనా శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పటి వరకు ఏపీలో 37,22,912 కరోనా శాంపిల్స్ నిర్వహించింది ప్రభుత్వం.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story