AP Corona Updates: ఏపీలో కొత్తగా 9,996 కరోనా కేసులు, 82 మంది మృతి

AP Corona Updates: ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,996 కరోనా కేసులు

Krishna
Published on: 13 Aug 2020 4:50 PM IST
AP Corona Updates: ఏపీలో కొత్తగా  9,996 కరోనా కేసులు, 82 మంది మృతి
X
coronavirus (File Photo)

AP Corona Updates: ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,996 కరోనా కేసులు వచ్చాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,64,142 కి చేరుకుంది. ఇందులో మొత్తం 90,840 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకూ 1,70,924 మంది కరోనా నుంచి కోలుకున్నారు.తాజాగా గడిచిన 24 గంటల్లో కరోనాతో 82 మంది చనిపోయారు. తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో 10 మంది, అనంతపురం జిల్లాలో 8, కడప జిల్లాలో 7, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో 6, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 5, కృష్ణా జిల్లాలో ఒకరు చనిపోయారు. దీనితో మరణించిన వారి సంఖ్య 2,378కి చేరుకుంది .

ఇక తాజా కేసులను ఒక్కసారిగా పరిశీలిస్తే... అత్యధికంగా ఈస్ట్ గోదావరిలో 1504 కేసులు వచ్చాయి. ఇక అనంతపురంలో 856, చిత్తూరులో 963, గుంటూరులో 595, కడపలో 784, కృష్ణాలో 330, కర్నూల్ లో 823, నెల్లూరులో 682, ప్రకాశంలో 681, శ్రీకాకుళంలో 425, విశాఖపట్నంలో 931, విజయనగరంలో 569, వెస్ట్ గోదావరిలో 853 కేసులు వచ్చాయి. ఇక ఇప్పటివరకూ రాష్ట్రములో 27,05,459 సాంపిల్స్ ని పరీక్షించారు.



Krishna

Krishna

Next Story