Coronavirus Updates in AP: ఏపీలో కొత్తగా 8,218 పాజిటివ్ కేసులు...

Coronavirus Updates In AP: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు తాజాగా గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 8,128 కరోనా కేసులు నమోదయ్యాయి..

S. Srikanth
Updated on: 19 Sept 2020 5:51 PM IST
Coronavirus Updates in AP: ఏపీలో కొత్తగా 8,218 పాజిటివ్ కేసులు...
X

Coronavirus Updates In AP: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు తాజాగా గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 8,218 కరోనా కేసులు నమోదయ్యాయి.. తాజా కేసులతో కలిపి రాష్ట్రములో కరోనా కరోనా కేసుల సంఖ్య 6,17,776 కు చేరుకుంది. ఇందులో 81,763 యాక్టివ్ కేసులో ఉండగా, 5,30,711 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. తాజాగా మరో 58 మంది కరోనాతో పోరాడి మృతి చెందారు.. దీనితో మృతి చెందిన వారి సంఖ్య 5,302కి చేరుకుంది.. ఇక గడచిన 24 గంటల్లో 74,595 టెస్టుల చేయగా, మొత్తం టెస్టుల సంఖ్య 50,33,636 కి చేరుకుంది..ఈ మేరకు ఏపీ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

ఇక తాజా కేసులలో అత్యధికంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో 1395 కేసులు నమోదు అయ్యాయి. అనంతపురం లో 477, చిత్తూరులో 737, గుంటూరులో 471, కడపలో 520, కృష్ణా జిల్లాలో 468, కర్నూలు జిల్లాలో మరో 319, నెల్లూరులో 693, ప్రకాశంలో 670, శ్రీకాకుళంలో 485, విశాఖపట్నంలో 451, విజయనగరంలో 462, వెస్ట్ గోదావరి లో 1071 కేసులు నమోదయ్యాయి.. ఇక చిత్తూరు 9, కృష్ణా 7, అనంతపురం 5, కడప జిల్లాలో 5, గుంటూరు 5, పశ్చిమగోదావరి 5, నెల్లూరు 4, విశాఖపట్నం 4, ప్రకాశం 4, తూర్పుగోదావరి 3, కర్నూలు జిల్లాలో 03, శ్రీకాకుళం 3,విజయనగరంలో ఒక్కరు మరణించారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 85,247, కర్నూల్ జిల్లా 53,754, అనంతపురం జిల్లా 52,298, పచ్చిమ గోదావరి జిల్లా 54,635, చిత్తూర్ జిల్లా 54,059, విశాఖపట్నం జిల్లా 46,508, గుంటూరు జిల్లాలో 48,864, నెల్లూరు లో 47,283, కడప 39,264, ప్రకాశం జిల్లాలో 40,826 కేసులు నమోదయ్యాయి.





S. Srikanth

S. Srikanth

Next Story