Coronavirus Updates in AP: ఏపీలో కొత్తగా 10,276 పాజిటివ్ కేసులు..

Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.. గడిచిన 24 గంటల్లో 10,276 కేసులు నమోదు అయ్యాయి..

Krishna
Published on: 22 Aug 2020 6:55 PM IST
Coronavirus Updates in AP: ఏపీలో కొత్తగా 10,276 పాజిటివ్ కేసులు..
X

Representational Image

Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.. గడిచిన 24 గంటల్లో 10,276 కేసులు నమోదు అయ్యాయి.. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,45,216కు చేరుకుంది.. ఇందులో 89,389 యాక్టివ్ కేసులు ఉండగా, 2,52,638 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక గడిచిన 24 గంటల్లో 97 మంది మృతి చెందారు. దీనితో మరణాల సంఖ్య 3,189కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 61,469 శాంపుల్స్ ను పరీక్షించారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో 31,91,326 పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది

చిత్తూరులో 13, అనంతపురం 11, నెల్లూరు 10, తూర్పుగోదావరి 8, కడప 8, కర్నూలు 8, గుంటూరు 6, విశాఖపట్నం 6, శ్రీకాకుళం 5, కృష్ణా 3, విజయనగరంలో ముగ్గురు మరణించారు. ఇక జిల్లాల పరంగా కేసులును చూసుకుంటే.. నాలుగు జిల్లాలలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.. తూర్పు గోదావరి జిల్లాలో 1321, పచ్చిమ గోదావరి జిల్లాలో 1033, గుంటూరులో 719, కడపలో 539, కృష్ణా జిల్లాలో 232, కర్నూల్ 850, నెల్లూరులో 943, ప్రకాశంలో 693, శ్రీకాకుళంలో 661, విశాఖపట్నంలో 540, విజయనగరంలో 505 కేసులు వచ్చాయి..


Krishna

Krishna

Next Story