Lockdown: ఏపీ, తెలంగాణలో అనుమానితుల కోసం జల్లెడ పడుతున్న అధికారులు.. ఇప్పటికే 150 మందిని క్వారంటైన్‌కి

Lockdown: ఏపీ, తెలంగాణలో అనుమానితుల కోసం జల్లెడ పడుతున్న అధికారులు.. ఇప్పటికే 150 మందిని క్వారంటైన్‌కి
x
Representational Image
Highlights

కరోనా వైరస్ కేసులు తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో 70, ఏపీలో 21 కరోనా పాజిటివ్ కేసులున్నాయి.

కరోనా వైరస్ కేసులు తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో 70, ఏపీలో 21 కరోనా పాజిటివ్ కేసులున్నాయి.ఈ నేపథ్యంలో ఢిల్లీ జమాత్ సభలకు వెళ్లి వచ్చిన వారు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన వారికి కరోనా వైరస్ సోకిందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. రెండు రాష్ట్రాలలో ఇప్పటికే కొంత మందిని గుర్తించిన పోలీసులు మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ముఖ్యంగా ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో 11 మంది అనుమానితుల్ని ఆదివారం ఆధికారులు గుర్తించారు. వారికి కరోనా వైరస్ సోకిందో లేదో తెలుసుకునే పనిలో ఉన్నారు. ఇందుకోసం అనుమానితుల శాంపిల్స్ సేకరించి పరీక్షలు జరుపుతున్నారు.

ఒకటి రెండు రోజుల్లో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. కాగా ఇటీవల మత ప్రార్ధనల కోసం ఢిల్లీలోని జమాత్‌కి వెళ్లి వచ్చిన గుంటూరు, ప్రకాశం జిల్లాల వ్యక్తుల్లో కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో రెండు రాష్ట్రాల అధికారులూ అప్రమత్తం అయ్యారు. కరోనా పాజిటివ్‌గా తేలిన వారి కుటుంబాల్లో 150 మందిని అదుపులోకి తీసుకొని క్వారంటైన్‌లో ఉంచారు. అనంతపురం జిల్లాలోని ఉరవకొండ, వజ్రకరూరుకి చెందిన ఐదు మందిని ఐసోలేషన్ వార్డులకు తరలించారు. అలాగే విజయనగరంలో 12 మందిని, రాజమండ్రిలో 21 మందిని ఐసోలేషన్ తరలించారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నుంచి 40 మంది వెళ్లినట్లు పోలీస్ అధికారులు గుర్తించారు. వారిలో 25 మందిని క్వారంటైన్‌ను తరలించారు. ఇక ఢిల్లీ నుంచి ఎవరెవరు ఏయే ప్రాంతాలకు వెళ్లారు అనేది తేలాల్సి ఉంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories