ఏపీలో భారీగా తగ్గుతున్న కరోనా కేసులు!

Coronavirus Update In AP: ఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 69,095 కరోనా టెస్టులు చేయగా, 3,503 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Krishna
Published on: 20 Oct 2020 8:16 PM IST
ఏపీలో భారీగా తగ్గుతున్న కరోనా కేసులు!
X

Coronavirus Update In AP: ఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 69,095 కరోనా టెస్టులు చేయగా, 3,503 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. ఇక తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7,89,553కి చేరుకుంది. అయితే ఇందులో 33,396 యాక్టివ్ కేసులుండగా, 7,49676మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒక్కరోజే 5,144 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక అటు గడిచిన 24 గంటల్లో కరోనాతో కొత్తగా 28 మంది చనిపోయారు. దీనితో మృతుల సంఖ్య 6,481కి చేరుకుంది.

ఇక చిత్తూరు, కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో నలుగురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. గుంటూరులో ముగ్గురు చనిపోయారు. అనంతపురం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కరు చొప్పున చనిపోయారు. అటు జిల్లాల పరంగా కేసులు చూసుకుంటే.. అనంతపుర్ లో 123, చిత్తూరులో 459, ఈస్ట్ గోదావరిలో 457, గుంటూరులో 387, కడపలో 398, కృష్ణాలో 117, కర్నూల్ లో 48, నెల్లూరులో 182, ప్రకాశంలో 308, శ్రీకాకుళం 94, విశాఖపట్నం 240, విజయనగరం 93, వెస్ట్ గోదావరి 524 కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఇప్పటివరకు ఎపీలో 71,96,628 కరోనా టెస్టులు నిర్వహించారు.

Krishna

Krishna

Next Story