విజయవాడలో కరోనా కలకలం.. ఏలూరు ఆసుపత్రిలో 2 కరోనా అనుమానిత కేసులు

Arun Chilukuri
Updated on: 4 March 2020 5:23 PM IST
విజయవాడలో కరోనా కలకలం.. ఏలూరు ఆసుపత్రిలో 2 కరోనా అనుమానిత కేసులు
X
చికిత్స పొందుతున్న యువకుడు

ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు, విజయవాడల్లో పలు కరోనా అనుమానిత వ్యక్తులు ఆస్పత్రుల్లో చేరారు. విజయవాడకు చెందిన ఓ యువకుడికి కరోనా వైరస్‌ సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆ యువకుడుని నగరంలోని కొత్త ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జీజీహెచ్‌ ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాధితుడు ఇటీవల జర్మనీ నుంచి విజయవాడకు వచ్చినట్లు తెలుస్తోంది.

పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కలకలం రేగింది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 2 కరోనా అనుమానిత కేసులు నమోదు అయ్యాయి. 10 రోజుల క్రితం కువైట్ నుంచి ఓ వ్యక్తి తణుకుకు వచ్చారు. కొద్ది రోజల నుంచి అతడు జలుబు, దగ్గు, శ్వాస తీర్చుకోవడంలో ఇబ్బందులు పడుతున్నాడు. ఇవే లక్షణాలు మరో వ్యక్తిలో కనిపించాయి. కరోనా అనుమానంతో తణుకు నుంచి ఏలూరు ఆసుపత్రికి తరలించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story