Coronavirus: తాడేపల్లిలో కరోనా కలకలం

Coronavirus: మున్సిపల్ ఆఫీస్‌లో 10మంది ఉద్యోగులకు పాజిటివ్‌ * నలుగురు అధికారులు సహా 10మందికి కరోనా

Sandeep Eggoju
Published on: 11 March 2021 4:42 PM IST
Coronavirus Fear in Tadepalli Municipal Office
X

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Coronavirus: తాడేపల్లిలో కరోనా కలకలం రేగింది. మున్సిపల్ ఆఫీస్‌లో 10మంది ఉద్యోగులకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణైంది. నలుగురు అధికారులు సహా 10మందికి కరోనా రావడంతో తాడేపల్లి మున్సిపల్ ఆఫీస్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. అధికారులు, ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారు. అప్రమత్తమైన వైద్యాధికారులు తాడేపల్లి మున్సిపల్ ఆఫీస్‌లో ఉద్యోగులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు.

అలాగే, ప్రైమరీ కాంటాక్ట్స్‌ను గుర్తించే పనిలో పడ్డారు. కరోనా మళ్లీ విజృంభిస్తున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్స్ వాడాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story