Andhra Pradesh: తూర్పు గోదావరి జిల్లా మలికిపురంలో కరోనా కలకలం
Andhra Pradesh: ఎంపీయూపీ పాఠశాలలో 5 మందికి వైరస్ * నలుగురు ఉపాధ్యాయులు, ఒక వంటమనిషికి పాజిటివ్
కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)
Andhra Pradesh: తూర్పు గోదావరి జిల్లాలోని మలికిపురంలో కరోనా కలకలం రేపుతోంది. నాలుగు రోజుల క్రితం ఎంపీయూపీ పాఠశాలలో 5 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. నలుగురు ఉపాధ్యాయులు, ఒక వంట మనిషికి కరోనా పాజిటివ్ తేలింది. మరోవైపు మలికిపురం గ్రామ సమీపంలో ఒక మహిళ నిన్న కరోనాతో మృతి చెందింది. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఇవాళ ఎంపీయూపీ పాఠశాల విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. 198 మంది విద్యార్థులతో పాటు అవసరమైతే విద్యార్థుల కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తామని అధికారుల తెలిపారు.
Next Story




