Tirupati: తిరుమలలో కరోనా వ్యాప్తి

Tirupati: ఇప్పటికే వైరస్‌తో 15 మంది ఉద్యోగులు మృతి * హోం ఐసోలేషన్‌లో పలువురు సిబ్బంది

Sandeep Eggoju
Published on: 4 May 2021 9:01 PM IST
Coronavirus Expanding in Tirumala
X

తిరుమల టెంపుల్ 

Tirupati: తిరుమలలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు వైరస్‌ బారినపడి 15 మంది టీటీడీ ఉద్యోగులు మృత్యువాత పడ్డారు. పలువురు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. దీంతో.. ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. టీటీడీ ఉద్యోగుల కుటుంబాల రక్షణ కోసం చర్యలు చేపట్టింది. తిరుపతి బర్డ్‌ ఆస్పత్రిలో ప్రత్యేకంగా కోవిడ్‌ వార్డును అందుబాటులోకి తీసుకొచ్చింది. 40 ఆక్సిజన్‌ సిలిండర్లతో పాటు.. సుమారు 20 పడకలతో వెంటిలేటర్ సదుపాయం ఉన్న ఐసీయూ వార్డు ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం ఉన్న రెండు వెంటిలేటర్లతో పాటు అదనంగా వెంటిలేటర్ల కొనుగోలుకు ప్రతిపాదనలు చేస్తోంది. ఇప్పటికే 40 సాధారణ బెడ్లను సిద్ధం చేయగా.. మరో 60 ఆక్సిజన్ పడకల ఏర్పాటుకు ప్లాన్‌ చేస్తోంది టీటీడీ.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story