Anantasagaram: నమాజ్ ఉపవాస దీక్షలు ఇళ్లల్లోనే ఉండి నిర్వహించుకోవాలి
అనంతసాగరం: త్వరలో రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అనంతసాగరం తహాసీల్దార్ కార్యాలయంలో మండల పరిధిలోని ముస్లిం మత పెద్దలతో అనంతసాగరం తహాసీల్దార్ పద్మావతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఉపవాస దీక్షలు ఇళ్లల్లోనే ఉండి నిర్వహించుకోవాలని ఎవరూ నమాజ్ కోసం మసీదులకు వెళ్లకూడదని కేవలం మసీదులో హిమములు మాత్రమే సమయానికి హజయించి ఉపవాస దీక్షల ప్రారంభ సమయం ముగింపు సమయం తెలియజేస్తారని అన్నారు. అలా కాకుండా సమయానికి మసీదులకు వెళ్లి ప్రార్థనలు చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మధుసూదన్ రావు, ఎస్సై ప్రభాకర్, ముస్లిం మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
Next Story




