ఏపీలో స్కూల్స్‌లో కరోనా కలకలం.. తెరిచిన వెంటనే భయపెడుతున్న కరోనా

ఏపీలో స్కూల్స్‌లో కరోనా కలకలం.. తెరిచిన వెంటనే భయపెడుతున్న కరోనా
x
Highlights

ఏపీ సీఎం జగన్ కరోనా విజృంభణ తొలిరోజుల్లో కోవిడ్‌తో కలిసి సహాజీవనం చేయక తప్పదని ప్రజలకు పిలుపునిచ్చారు. దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ, చివరకు అదే...

ఏపీ సీఎం జగన్ కరోనా విజృంభణ తొలిరోజుల్లో కోవిడ్‌తో కలిసి సహాజీవనం చేయక తప్పదని ప్రజలకు పిలుపునిచ్చారు. దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ, చివరకు అదే నిజం అవుతోంది. కోవిడ్ కారణంగా కొన్ని నెలలుగా మూతపడిన స్కూల్స్ రెండు రోజుల క్రితం తెరుచుకున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్కూల్స్ రన్ అవుతున్నాయి. అయితే స్కూళ్లు ఇలా తెరుచుకున్నాయో లేదో కరోనా కేసులు బయటపడుతున్నాయి.

స్కూల్స్ తెరుచుకోవడంతో విద్యార్థులు, టీచర్లు బడి బాట పట్టారు. తల్లిదండ్రుల అంగీకార పత్రంతో విద్యార్థులు బడికి వస్తున్నారు. రెండో రోజున ఏపీలో 99.92 శాతం మేర తెరుచుకున్నాయి. మొత్తంగా 33శాతం మేర విద్యార్థులు, 90 శాతం మేర టీచర్లు విధులకు హాజరు అయ్యారు. కృష్ణా జిల్లా మినహా అన్ని జిల్లాల్లోనూ వంద శాతం మేర పాఠశాలలు తెరుచుకున్నాయి. గత రెండు రోజులతో పోలిస్తే మూడో రోజు విద్యార్థుల హాజరు శాతం పెరిగిందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. అయితే ఇదే సమయంలో కోవిడ్ వైరస్ విజృంభణ మాత్రం ఆగడం లేదు. ఏపీలోని కొన్ని జిల్లాల ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా టెన్షన్ పెడుతోంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. దాంతో తల్లిదండ్రులు పిల్లలను స్కూళ్లకు పంపాలంటే భయపడిపోతున్నారు.

ప్రకాశం జిల్లాలో నాలుగు జిల్లా పరిషత్ హైస్కూళ్లలో కరోనా కలకలం రేగింది. నాలుగు జెడ్పీ హైస్కూల్స్‌లో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కరోనా సోకింది. నలుగురు ఉపాధ్యాయులు, ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జరుగుమిల్లి మండలం పచ్చవలో ఇద్దరు విద్యార్థులు, ఓ ఉపాధ్యాయుడు కరోనా బారిన పడ్డారు. మరోవైపు త్రిపురాంతకం హైస్కూల్‌లో ఒక ఉపాధ్యాయుడికి, పీసీపల్లి హైస్కూల్‌లో ఓ విద్యార్థి, ఉపాధ్యాకుడికి కరోనా సోకింది. హనుమంతునిపాడు మండలం పెద్దగొల్లపల్లి హైస్కూల్లో కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్ధులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీంతో ప్రకాశం జిల్లా డీఈవో కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు.

తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం పొన్నమండ హైస్కూ‌‌ల్‌లో కరోనా కలకలం రేపింది. మిడ్‌ డే మీల్ వర్కర్‌కు కరోనా సోకింది. ఆమె రెండు రోజుల క్రితం స్కూల్‌లో పిల్లలకు వంట చేసి పెట్టిందని తెలియడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా కామవరపు కోట మండలం ఈస్ట్ ఎడవల్లిలో 9 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. గత నెల 28న ఈస్ట్‌ యడవల్లి జడ్పీ స్కూల్లో సుమారు 117 మంది విద్యార్థులకు, టీచర్లకు కరోనా టెస్ట్‌లు నిర్వహించారు. అందులో 9 మంది విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ అయింది.

చిత్తూరు జిల్లాలో కరోనా విజృంభింస్తుంది. రెండు రోజుల క్రితం స్కూళ్లు తెరవడంతో కరోనా టీచర్లు, విద్యార్థులకు వ్యాపిస్తుంది. గడిచిన 2రోజుల్లోనే జిల్లా వ్యాప్తంగా 150 మంది టీచర్లకు కరోనా నిర్ధారణ అయింది. దాంతో కోవిడ్ పరీక్షల కోసం ఉపాధ్యాయులు క్యూ కడుతున్నారు. ఈ నెల 8లోపు పరీక్షలు చేయించుకోవాలని జిల్లా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు నెల్లూరు జిల్లాలో ముగ్గురు విద్యార్థులు, ఓ టీచరుకు కర్నూలు జిల్లాలో ఓ టీచర్‌కు కోవిడ్ సోకింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories