Corona: ఏపీ బడ్జెట్​పై కరోనా ప్రభావం

Coronavirus Effect on Andhra Pradesh Budget
x
ఏపీ బడ్జెట్ సమావేశాలు (ఫైల్ ఇమేజ్)
Highlights

Corona: అంతంత మాత్రంగానే ఆదాయం * సెకండ్‌ వేవ్‌ ప్రభుత్వ ఆదాయానికి గండి

Corona: 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. అసలే లోటు.. ఆపై కరోనా కష్టకాలం. ఈ తరుణంలో ఏపీ బడ్జెట్ ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభం కానున్నాయి. గ‌వ‌ర్నర్ ప్రసంగం అనంత‌రం 2021-22 ఆర్ధిక బ‌డ్జెట్‌ను ప్రవేశ‌పెట్టనుంది సర్కార్. అయితే ఇప్పటికే మూడు నెల‌ల కాలానికి రూ.70,983.11 కోట్ల అంచనాతో ఓటాన్ ఎకౌంట్ ను అర్డినెన్స్ రూపంలో ఆమోదించింది ప్రభుత్వం. మిగిలిన 9 నెల‌ల కాలానికి పూర్తి స్థాయి ఆర్ధిక బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది.

వరుసగా రెండో ఏడాది కూడా ఏపీ బ‌డ్జెట్‌పై క‌రోనా ప్రభావం చూప‌నుంది.. గ‌త ఏడాది క‌రోనా కార‌ణంగా ప్రభుత్వ అంచనాల మేర‌కు ఆదాయం రాలేదు. క‌రోనా సెకండ్ వేవ్ కూడా ప్రభుత్వం ఖ‌జానాకి గండికొడుతుంది. ఏటా బడ్జెట్‌ అంచనాలు ఎంతో కొంత పెరగడం సహజం. రెండేళ్లుగా ఈ పరిస్థితులు కనిపించడం లేదు. ఈ ఏడాది బ‌డ్జెట్ రూ.2.28 లక్షల కోట్ల నుంచి 2.38 లక్షల కోట్ల వ‌ర‌కు ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

క‌రోనాతో 2020-21 ఆర్ధిక సంవ‌త్సరం ఆదాయ‌, వ్యయాల మ‌ధ్య భారీ అంత‌రం వెలుగు చూసింది. గ‌త ఏడాది 1 ల‌క్షా 81 వేల 936 కోట్లు వ్యయం కాగా ప్రభుత్వానికి వ‌చ్చిన ఆదాయం కేవ‌లం 77 వేల 560 కోట్లు మాత్రమే.. లొటు 1 ల‌క్షా 4 వేల 383 కోట్లు రుపాయిలు. ఒక ఏడాదిలో లక్ష కోట్లకు పైగా లోటు రావడం రాష్ట్ర చ‌రిత్రలో ఇదే తొలిసారి. ఈ లోటును కూడా కేంద్రం ఇచ్చిన గ్రాంట్లు, వివిధ రూపాల్లో తీసుకు వ‌చ్చిన అప్పులు ద్వారా నెట్టుకోచ్చారు. తాజాగా తీసుకున్న అప్పులు తీర్చడంతో పాటు సంక్షేమానికి కావాల్సిన నిధులు 2021-22 ప్రస్తుత‌ ఆర్ధిక సంవ‌త్సరంలో స‌మ‌కూర్చుకోవాల్సి ఉంటుంది.

ఈ ఆర్ధిక సంవ‌త్సరం జ‌గ‌న్ స‌ర్కార్ కు క‌త్తిమీద సాములా మార‌నుంది. ఈ సంవ‌త్సరం కూడా వ్యయం దాదాపు 2 లక్షల కోట్లు వ‌ర‌కు ఉంటుంద‌ని అంచానా. గ‌త ఏడాది ల‌క్ష కోట్ల లోటు. ఈ ఏడాదికి మొత్తం వ్యయం 3 ల‌క్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉంద‌ని ఆర్ధిక వ‌ర్గాలు అంచనా వేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories