Coronavirus Effect: తహశీల్దారు కార్యాలయం రెండు రోజులు మూసివేత

Coronavirus Effect: చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలు అనే వ్యత్యాసం లేకుండా ఎక్కడ పడితే అక్కడ కరోనా మహామ్మారి

admin1
Published on: 3 July 2020 9:15 AM IST
Coronavirus Effect: తహశీల్దారు కార్యాలయం రెండు రోజులు మూసివేత
X

Coronavirus Effect: చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలు అనే వ్యత్యాసం లేకుండా ఎక్కడ పడితే అక్కడ కరోనా మహామ్మారి విస్తరించడం వల్ల ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దీనిని కట్టడి చేసేందుకు ఒక పక్క చర్యలు తీసుకుంటుండగా, మరో పక్క ప్రజల తాకిడి ఎక్కువగా ఉండే ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటిస్తున్నారు. అయితే తాజాగా తూర్పు గోదావరి జిల్లా, గంగవరం తహశీల్దారు కార్యాలయంలోని సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ఏకంగా కార్యాలయాన్నే రెండు రోజుల పాటు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. నెలల తరబడి లాక్ డౌన్ విధించినప్పటికీ చాపకింద నీరు విస్తరిస్తూనే ఉంది. ఇంతకాలం పట్టాణాలకే పరిమితమైన వైరస్ గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తోంది. తాజాగా రాజమండ్రీలోని గంగవరం తహశీల్దారు కార్యాలయంలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో అతన్ని వెంటనే స్థానిక క్వారంటైన్ కేంద్రానికి తరలించారు అధికారులు. అటు, తహశీల్దార్ కార్యాలయాన్ని రెండు రోజుల పాటు మూసివేయాలని సబ్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కార్యాలయ పరిసరాలను పూర్తిగా శానిటైజేషన్ చేసిన అనంతరం మళ్లీ తెరుస్తామని అధికారులు వెల్లడించారు. అయితే, కరోనా సోకిన వ్యక్తిని కాంటాక్ట్ అయిన వారి వివరాలను ఆరోగ్య అధికారులు సేకరిస్తున్నారు.


admin1

admin1

Next Story