ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు.. అనంతపురం జిల్లాలో..

ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు.. అనంతపురం జిల్లాలో..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ కరోనా వైరస్ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ కరోనా వైరస్ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గురువారం రాత్రి 9 నుంచి శుక్రవారం ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో అనంతపురం జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. దీంతో తాజాగా నమోదైన 2 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 365 కి పెరిగింది. ఈ మేరకు అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

మరోవైపు జిల్లాల వారీగా కూసుకుంటే విశాఖపట్నం 20, తూర్పు గోదావరి 12, పశ్చిమ గోదావరి 22, కృష్ణా 35, గుంటూరు 51, ప్రకాశం 38, నెల్లూరు 48, కడప 29, కర్నూల్ 75, చిత్తూరు 20, అనంతపురం 15 గా నమోదయ్యాయి.

కాగా ఇప్పటివరకు ఏపీలో కరోనాతో కోలుకుని 10 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలావుంటే భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,725కు చేరింది. ఇప్పటివరకు 635 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయితే.. 5,863 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories