Coronavirus: ఏపీలో కరోనా విజృంభణ.. తాజా లెక్కలు ఇవే

Coronavirus: ఏపీలో కరోనా విజృంభణ.. తాజా లెక్కలు ఇవే
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉద్ధృతి తీవ్రమైంది. శనివారం రాత్రి కి 4 పాజిటివ్ కేసులు ఉండగా.. ఆదివారం ఒక్క సారిగా ఈ రాష్ట్రంలో 68 మందికి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉద్ధృతి తీవ్రమైంది. శనివారం రాత్రి కి 4 పాజిటివ్ కేసులు ఉండగా.. ఆదివారం ఒక్క సారిగా ఈ రాష్ట్రంలో 68 మందికి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 258కి చేరింది. కర్నూలు జిల్లాలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున కేసులు నమోదు కావడంతో జిల్లా వాసులు ఆందోళన నెలకొంది.

ఇప్పటివరకు కరోనా బారిన పడి ఒకరి మృతి చెందగా ఐదుగురు కోలుకోని ఇళ్లకు వెళ్లారు. కరోనా పాజిటివ్ కేసుల్లో విదేశాల నుంచి వచ్చిన వారు 11 మంది కాగా... వారి సన్నిహితంగా ఉన్నవారు ఆరుగురు ఉన్నారు. మిగతావారు అత్యధికులు ఢిల్లీ లో మత ప్రార్థనలలో పాల్గొన్నవారే ఉన్నారు వారితో పాటు వారి కుటుంబానికి సంబంధించి వారికి పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి.

ముఖ్యంగా కర్నూలు, నెల్లూరు జిల్లాలో అత్యధికంగా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో కూడా 30 కేసులు నమోదయ్యాయి. కేసులు పెరగకుండా వుండేందుకు అధికారులు లాక్‌డౌన్ పటిష్టంగా అమలయ్యేలా చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రదేశాల్ని రెడ్ జోన్లుగా ప్రకటి అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు.

ఇక కర్నూలు, గుంటూరు, నెల్లూరు జిల్లాలో పెరుగుతున్న కేసులకు కారణం ఢిల్లీ ప్రార్థనలకు వెళ్ళినవారు, వారితో కొంటాక్ట్ వున్నవారు అని ఆరోగ్య శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలో అనుమానిత కేసులున్నాయి. వాటి రిపోర్టులు వస్తే పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉంది. కర్నూలు జిల్లా నుంచి 449 మంది ఢిల్లీ జమాత్‌కి వెళ్లారు. వాళ్ల శాంపిల్స్ పంపించగా, 300 మంది రిపోర్టులు రావాల్సి ఉంది.

జిల్లాల వారీగా ఇప్పటివరకు నమోదైన కేసు వివరాలు చూస్తే..

కర్నూలు 56, నెల్లూరు 34, అత్యధిక కేసులు నమోదయ్యాయి.గుంటూరు 30 , కృష్ణాజిల్లా 28, కడప 23, ప్రకాశం 23, విశాఖపట్నం 15, పశ్చిమగోదావరి 15, తూర్పుగోదావరి 11 చిత్తూరు 17, అనంతపురం 6, కేసు నమోదు అయ్యాయి. అధికారికంగా ఒక వ్యక్తి కరోనా బారిన పడి మరణించారు. ఇప్పటివరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories