ఏపీలో కరోనా ఉధృతి.. ఐదుగురు మృతి

Andhra Pradesh: రాష్ట్రవ్యాప్తంగా 9,07,676కి చేరిన కరోనా కేసుల సంఖ్య..ఏపీలో కరోనాతో ఇప్పటివరకు మొత్తం 7,239 మంది మృతి

Sandeep Eggoju
Published on: 4 April 2021 7:49 PM IST
Corona virus in Andhra Pradesh
X

కరోనా వైరస్ ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh: ఏపీలో కరోనా సెకండ్ వేవ్ పెచ్చరిల్లుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31 వేల 72 శాంపిల్స్ టెస్ట్ చేయగా వారిలో 17వందల 30 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8లక్షల 90 వేలకు పైగా ఉన్నాయి. ఇవాళ కొవిడ్ బారిన పడి మరో ఐదుగురు చనిపోయారు.. దాంతో ఏపీలో మరణించిన వారి సంఖ్య 7వేల 2వందల 39కి చేరింది.

ఇవాళ అత్యధికంగా గుంటూరు జిల్లాలో కేసులు నమోదు అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా 378 మందికి కొవిడ్ సోకింది. చిత్తూరులో 338, విశాఖలో 235, కృష్ణాలో 226, నెల్లూరు 164 చొప్పున కేసులు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా సోకి చిత్తూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరు, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో 10 వేల 300 యాక్టివ్ కేసులున్నట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story