Corona Virus: ఏపీలో పెచ్చరిల్లుతోన్న కరోనా మహమ్మారి

Corona Virus: ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతునే ఉంది.

Samba Siva Rao
Published on: 27 March 2021 5:32 PM IST
Corona virus Andhra pradesh
X

కరోనావైరస్ ప్రతీకాత్మక చిత్రం

Corona Virus: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. వారం పది రోజుల నుంచి రోజుకు వందలాది కొవిడ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 42వేల 696 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 947 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో ఏపీలో 9లక్షలకు చేరువలో పాజిటివ్‌ కేసులున్నాయి.

ఇవాళ కొవిడ్ నుంచి కోలుకుని మరో 377 మంది డిశ్చార్జ్ అయ్యారు.. దీంతో 88లక్షలకు పైగా కొవడ్ బారి నుంచి బయటపడినట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 7వేల 203 మంది మరణించారు..

ఇవాళ నమోదు అయిన కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. ఒక్కరోజులోనే జిల్లా వ్యాప్తంగా ఏకంగా 180మందికి కరోనా సోకింది. గుంటూరు 145, విశాఖ 156, కృష్ణా 113, కర్నూలు 61, తూర్పుగోదావరి 58, శ్రీకాకుళం 56 మందికి కరోనా సోకింది.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story