Corona Cases: ఏపీలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు..22 మంది మృతి

Corona Positive Cases: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.

Samba Siva Rao
Published on: 18 April 2021 6:25 PM IST
corona virus
X

కరోనా వైరస్ 

Corona Positive Cases: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 6వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 6వేల 582 మందికి కరోనా సోకింది. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య.. 9లక్షల 62వేల 037కు చేరింది. తాజాగా.. కరోనా బారిన పడి 22 మంది మృత్యువాత పడడంతో.. రాష్ట్రంలో 7వేల 410 కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. కొత్తగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు మృతి చెందగా.. నెల్లూరులో 4, కృష్ణా జిల్లాలో 4, కర్నూలులో 3, అనంతపురంలో 2, గుంటూరులో 2, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.




Samba Siva Rao

Samba Siva Rao

Next Story